ప్రవళిక ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్..!

-

ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రవళిక సోదరుడు ఓ వీడియో రిలీజ్ చేశాడు. తన సోదరి ఆత్మహత్యకు శివరామ్ వేధింపులే కారణమని ఆరోపించాడు. ఇటీవల హైదరాబాద్ లో గ్రూప్ 2 అభ్యర్థిని ప్రవళిక సూసైడ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ప్రవళిక ఆత్మహత్య రాజకీయంగా చర్చనీయాంశం అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఆరోపణలు చేశాయి.

అయితే ప్రవళిక సూసైడ్ కు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు శివరామ్ అనే యువకుడే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ మంగళవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. శివరామ్ వేధింపుల కారణంగానే తన సోదరి సూసైడ్ చేసుకుందని ప్రవళిక సోదరుడు ప్రణయ్ వీడియోలో తెలిపారు.ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

ప్రవళిక సోదరుడు ఓ వీడియో రిలీజ్ చేశాడు. తన సోదరి ఆత్మహత్యకు శివరామ్ వేధింపులే కారణమని ఆరోపించాడు. ఇటీవల హైదరాబాద్ లో గ్రూప్ 2 అభ్యర్థిని ప్రవళిక సూసైడ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ప్రవళిక ఆత్మహత్య రాజకీయంగా చర్చనీయాంశం అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఆరోపణలు చేశాయి. అయితే ప్రవళిక సూసైడ్ కు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు శివరామ్ అనే యువకుడే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ మంగళవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. శివరామ్ వేధింపుల కారణంగానే తన సోదరి సూసైడ్ చేసుకుందని ప్రవళిక సోదరుడు ప్రణయ్ వీడియోలో తెలిపారు.

ప్రవళిక హాస్టల్‌లో ఉండి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు శివరామ్ వేధించేవాడని ప్రణయ్ ఆరోపించారు. శివరామ్, అతడి స్నేహితుల ఫోన్‌లతో పాటు ఇతర నంబర్ల నుంచి కాల్స్‌ చేసి ప్రవళికను వేధించేవాడని తెలిపారు. తన బాధను ఎవరితో చెప్పుకోవాలని తెలియక తన సోదరి ప్రవళిక సూసైడ్ చేసుకుందని ప్రణయ్ ఆవేదన చెందారు. వేధింపులకు పాల్పడ్డ శివరామ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన సోదరి ఆత్మహత్యను రాజకీయం చేయొద్దని ప్రవళిక తల్లి, సోదరుడు కోరారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version