గద్వాల్ లో లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు…40 మందికి గాయాలు !

-

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింంది. గద్వాల్ లో లారీని ఢీకొట్టడంతో ట్రావెల్స్ బస్సు తుక్కు తుక్క అయింది. అలాగే ట్రావెల్స్ బస్సులో ఉన్న 40 మందికి గాయాలు అయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. యుటర్న్ చేసుకుంటున్న లారీని ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

A private travel bus collided with a U-turning lorry

ఆ వెంటనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది మరో కావేరి ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలు అయ్యాయి. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే… గాయపడిన 40 మంది ప్రయాణికులు రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వారని సమాచారం. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news