SLBC టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు బతికే ఛాన్స్ లేదని రెస్క్యూ టీం సిబ్బంది ఒకరు ప్రకటించారు. తాజాగా ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది మీడియాతో మాట్లాడారు. SLBC టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులపై ఆశలు లేవు.. వాళ్లు బ్రతకడం చాలా కష్టం అన్నారు. లోపల కూలిన మట్టి, రాళ్లను తీయాలంటే సంవత్సరం పైనే పడుతుందని వెల్లడించారు.

టన్నెల్ లోపల ప్రమాదం పొంచి ఉంది.. లోపలికి వెళ్లే కొద్దీ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందని తెలిపారు. టన్నెల్ లోపల మట్టి మళ్ళీ కూలే ప్రమాదం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చారు. డెహ్రాడూన్‌లో 41 మందిని కాపాడినం కానీ ఇక్కడ ఆశలు లేవు కాబట్టి మేము తిరిగి వెళ్ళిపోతున్నామని తెలిపారు ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది.