రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది – రేవంత్ రెడ్డి

-

బిఆర్ఎస్ పార్టీని వీడి నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆదిలాబాద్ జిల్లా నేత శ్రీహరి రావుకు సాదర స్వాగతం పలికారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. శ్రీహరి రావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా నుండి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందన్నారు. అలాగే పార్టీ గెలుపు కోసం పనిచేసే వారి గుర్తింపు లభిస్తుందన్నారు.

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని అన్నారు రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ లో 10కి 8 సీట్లు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మల్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కచ్చితంగా నిర్మల్ అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని స్పష్టం చేశారు. కొడంగల్ లో గెలవడం ఎంత ముఖ్యమో నిర్మల్ నియోజకవర్గంలో గెలవడం కూడా అంతే ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version