RTC బస్సుపై దాడి చేసిన దుండగులు..సజ్జనార్‌ వార్నింగ్‌

-

హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. ఈ సంఘటనపై ఆర్టీసీ ఎంపీ సజ్జనార్‌ స్పందించారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు.

ఆర్టీసీ బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తునూ ప్రారంభించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలే. ప్రజల ఆస్తిపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచి వసూలు చేయడం జరుగుతుందని వివరించారు ఆర్టీసీ ఎంపీ సజ్జనార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version