సిరిసిల్ల కలెక్టర్ వల్ల జైలుకు పోయిన అబ్బాడి రాజిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా మీకే కాదు.. ఎవ్వరికీ అన్యాయం జరిగినా కాపాడుకుంటానని తెలిపారు. నా మీద కోపంతో సిరిసిల్ల కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాడు అని తెలిపారు. కేసీఆర్ కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే వీల్లు ఎవ్వరైనా మిగిలే వాళ్లు కాదు కదా అని రాజిరెడ్డితో పేర్కొన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. సిరిసిల్ల సైకో కలెక్టర్ సందీప్ కుమార్ జా అహంకారానికి పొలం పని చేసుకునే రైతు అబ్బాడి రాజిరెడ్డి కుటుంబం రోదిస్తుంది. జైలుకు వెళ్లడంతో కుటుంబం కన్నీటి పర్వంతం అయింది.