కేటీఆర్ కు మరో ఎదురు దెబ్బ.. ఏసీబీ నోటీసులు !

-

గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి యాంటీ కరప్షన్ బ్యూరో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈనెల 9వ తేదీన మరోసారి రావాలని కేటీఆర్ కు నోటీసులు ఇష్యూ చేసింది ఏసీబీ. ఈ మేరకు నోటీసుల్లో.. స్పష్టంగా పేర్కొంది. ఇవాళ ఉదయమే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ రావడం జరిగింది.

అయితే తనతో పాటు తన లీగల్ టీం కూడా లోపలికి వస్తుందని కేటీఆర్ ఒక విజ్ఞప్తి చేశారు. కానీ ఏసీబీ మాత్రం దానికి అంగీకరించలేదు. ఈ తరుణంలోనే… కేటీఆర్ 30 నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం వద్ద ఉండి.. వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈసారి ఇచ్చిన నోటీసులలో.. లీగల్ టీంకు అనుమతి లేదని… కేటీఆర్ సింగిల్ గా రావాలని పేర్కొంది ఏసీబీ. దీంతో కేటీఆర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మరి ఈ నోటీసులపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version