తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మారువేషాల్లో వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.. లారీ డ్రైవర్లుగా వేషం మార్చుకుని చెక్పోస్ట్ల దగ్గర తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. అశ్వరావుపేట చెక్ పోస్ట్ దగ్గర ఏసీబీ అధికారుల సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రధానంగా లారీ డ్రైవర్ల వేషంలో వెళ్లిన ఏసీబీ అధికారులను లంచం డిమాండ్ చేశారు ఆర్టీఏ చెక్పోస్ట్ సిబ్బంది.. ఒక్కో వాహనం నుంచి అనధికారికంగా వందల రూపాయలు వసూలు చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఆర్డీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపక ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. చెకోపోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావా ఏసీబీ విచారిస్తోంది. నకిలీ ఇన్స్యూరెన్సులు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిరా అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. మహబూబాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏజెంట్ల వద్ద 45,100 నగదు, డ్రైవర్ వద్ద 16,500 నగదు, నూ లైసెన్స్లు, రెనివల్స్, ఫిట్నెస్కు సంబంధించిన పత్రాలను స్వాధీ చేసుకున్నారు.