తెలంగాణలో బాలికపై అత్యాచారం..నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

-

తెలంగాణలో బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనలో..నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. ఇప్పుడు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరస్తుడికి 20 యేండ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఎల్బీనగర్ పొక్సో స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది.

Accused sentenced to 20 years in prison

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాతపల్లి గ్రామానికి చెందిన సపావత్ అంజిత్ కుమార్(28) 2017 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటనలో మంచాల పోలీసులు పొక్సో చట్టం కింద కేసు అయింది. ఈ తరుణంలోనే సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించగా , విచారణ జరిపింది ఎల్బీ నగర్ లోని పొక్సో స్పెషల్ కోర్టు. దీంతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరస్తుడికి 20 యేండ్లు జైలు శిక్ష పడింది. ఇక కోర్టు తీర్పు పట్ల బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version