ICFAI విద్యార్థిని పై యాసిడ్ దాడి.. ట్విస్ట్ ఇచ్చిన యూనివర్సిటీ డైరెక్టర్..!

-

ఐసీఎఫ్ఎస్ఐ యూనివర్సిటీ విద్యార్థిని లేఖ్య పై నిన్న యాసిడ్ దాడి జరిగిందనే వార్తలు వెలుగు చూశాయి. గుర్తుతెలియని వ్యక్తులు బకెట్లో యాసిడ్ పోయగా.. విద్యార్థిని మగ్గుతో ముంచుకుని శరీరంపై పోసుకుందని.. ఈ నేపథ్యంలో ఆ యువతి భరించలేని బాధతో కేకలు వేయగా తనతోపాటు చదువుకుంటున్న విద్యార్థినిలు చూసి, కళాశాల యాజమాన్యానికి చెప్పగా, యాజమాన్యం ఆ యువతిని ఆసుపత్రికి తరలించారనే అనే కథనాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అయితే IFCAI విద్యార్థినిపై యాసిడ్ దాడి అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ డైరెక్టర్ తేల్చి చెప్పారు. ఆ అమ్మాయి మరో ముగ్గురు అమ్మాయిలతో కలిసి హాస్టల్ రూమ్ లో ఉంటుందని, అయితే ఆ ముగ్గురికి పరీక్షలు అయిపోవడంతో వాళ్లు వాళ్ల ఇల్లకు వెళ్లారని ప్రస్తుతం ఈమె మాత్రమే ఉంటుంది అని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం ఆ యువతి రూమ్ తాళాలు తీసుకుని రూమ్ లోపలికి వెళ్లిందని, దాదాపు 7:20 నిమిషాల ప్రాంతంలో ఆమె స్నానానికి వెళ్లి ఉంటుందని పేర్కొన్నారు.

వార్తల్లో వస్తున్నట్టు బకెట్లో యాసిడ్ నింపడం కారణంగానో లేక యాసిడ్ పోయడం వల్లనో ఆమెకు రాషెస్ రాలేదు అని తెలిపారు. కేవలం వేడి నీళ్ల వల్లనే ఆమెకు శరీరం పైన బొబ్బలు వచ్చాయని తెలిపారు. స్నానం చేసిన తరువాత యువతి సెక్యూరిటీ గార్డ్ వద్దకు వచ్చి తనకు ఒంటిపై బొబ్బలు వస్తున్నాయని చెప్పిందని తెలిపారు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ అంబులెన్స్ కి కాల్ చేశారని, అయితే అంబులెన్స్ వచ్చే లోపల యువతి నడుచుకుంటూ యూనివర్సిటీ క్లినిక్ వెళ్లిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version