లావణ్యపై పోలీసులకు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు

-

టాలీవుడ్ యంగ్  హీరో రాజ్‌తరుణ్‌- లావణ్య వివాదం గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.  పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో తాను సహజీవనం చేస్తున్నానని, తనను మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే లావణ్య తమను చాలా ఇబ్బందికి గురి చేస్తోందంటూ ఆమెపై రాజ్తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

బుధవారం రోజు రాత్రి లావణ్య తమ ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇద్దరికీ హెల్త్ సమస్యలు ఉన్నాయని, అయినా ఆమె ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ మాట్లాడుతూ..  హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి కాకతీయ హిల్స్లో నివాసం ఉంటున్నారని.. బుధవారం రాత్రి లావణ్య అనే యువతి వారి ఇంటికి వెళ్లి గట్టిగా డోర్ కొట్టి అరిచిందని హీరో తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version