బీజేపీలో ఈటెల బలి పశువు..చీఫెస్ట్‌ నాయకుడు – అద్దంకి దయాకర్

-

బీజేపీలో ఈటెల బలి పశువు..చీఫెస్ట్‌ నాయకుడని ఫైర్‌ అయ్యారు అద్దంకి దయాకర్. ఓటుకు ఆరు వేలు ఇచ్చింది ఎవరని ఈటలను నిలదీశారు. మేము బీఆర్‌ఎస్‌ పార్టీ తో కొట్లాడుతుంటే… నువ్వు కాంగ్రెస్ తో కొట్లాడుతున్నావని ఆగ్రహించారు.

నీ వ్యాపారులు కాపాడుకోవడం కోసమే బీజేపీ లోకి వెళ్ళావని.. నిన్ను బీజేపీ లో..చీపురు పుల్ల కంటే హీనంగా చూస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. రేవంత్ ని విమర్శించిన వాడు హీరో కాడు… నువేదో గొప్పోడు అనుకోకు అని అద్దంకి చురకలు అంటించారు.రాజగోపాల్ రెడ్డి దివాళా కోరు మాటలు మానుకో… కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్ లోనే ఉంటారన్నారు. బీజేపీ లోకి వస్తారని తప్పుడు ప్రకటనలు చేయకన్నారు అద్దంకి. ఈటెల..భాగ్యలక్ష్మి దేవాలయానికి రావాలి… లేదంటే రాజకీయ దివాళా కోరు అని ప్రకటిస్తామని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version