కేసీఆర్ కు అడ్వయిజరీ నోటీస్ జారీ.. రిపీట్ అయితే చర్యలు తప్పవు : ఈసీ

-

ప్రజల మధ్య విద్వేషాలను వైశాల్యాలను రెచ్చగొట్టే ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని.. ప్రచారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హుందాతనంగా ఉండాలని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో మొండికత్తి అంశాన్ని ప్రసాదిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగాన్ని ఈసీ తప్పు పట్టింది. ఇంకోసారి నోరు జారొద్దని రిపీట్ అయితే నిబంధన ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని ఈసీ ప్రిన్సిపాల్ సెక్రటరీ అవినాష్ కుమార్ స్పష్టం చేశారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడి అంశాన్ని ప్రసాదిస్తూ మాకు చేతులు లేవా మాకు మండే కత్తులు దొరకరా మాకే తిక్క రేగితే రాష్ట్రంలో దుమ్ము లేవాలి జాగ్రత్త.. ఇది నా హెచ్చరిక అంటూ గత నెల ముప్పయిన జరిగిన సభలో ప్రసంగించారు.

ఈ వ్యాఖ్యలను ఎన్ఐసిఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఈసీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే కోడ్ అమల్లోకి వచ్చిందని.. ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకులు దానికి కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుందని కెసిఆర్ కు జారీ చేసిన అడ్వైజరిలో అవినాష్ కుమార్ గుర్తు చేశారు. ఇంకోసారి ఇలాంటి ఘటన రిపీట్ కావద్దని.. మళ్లీ పునరావృతం అయితే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో జరిగిన సభలో ఇందు వాళ్ళు బంధుగాళ్ళు అనే కామెంట్ చేయడంతో అప్పుడు కూడా నోటీసు జారీ అయింది తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ స్పీచ్ పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version