ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీదే అధికారం : కేసీఆర్

-

ఖానాపూర్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. సంక్షేమం ఎలా జరిగింది పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఎలా జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు సీఎం కేసీఆర్. రైతుబంధు పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నామని.. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏమో మూడు గంటల కరెంటు ఇస్తామంటుంది. మరి 24 గంటల కరెంటు కావాలా మూడు గంటల కరెంట్ కావాలా అని ప్రశ్నించారు.

Four public blessing meetings today

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తాం అంటుంది రైతులకు మల్లి కష్టాలే అని ధరలను తీసేస్తే అసలు రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ దళారి రాజ్యము వస్తుందన్నారు అభ్యర్థులనే కాకుండా వాళ్ళ వెనక ఉన్న పార్టీలను కూడా చూడని ఆ పార్టీల చరిత్ర తెలుసుకొని ఓటు వేయాలని సూచించారు ఆలోచించకపోతే ఐదేళ్లు నష్టపోతారన్నారు. టిఆర్ఎస్ మరొకసారి గెలవాలి మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మరోసారి భారీ మెజార్టీతో టిఆర్ఎస్ గెలవబోతుందని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version