ప్రభుత్వం మారాక వారిలో మార్పు కనిపిస్తోంది.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పక్కకు బెట్టి వ్యక్తి గత కక్షలను కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని సీరియస్ అయ్యారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.

రైతులకు పలు హామీలు గుప్పించి.. రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చింది తప్ప.. తెలంగాణ ప్రజల జీవితల్లో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. కాంగ్రెస్ ది ప్రజా ప్రభుత్వం కాదని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతు భరోసా లో అనేక కొర్రీలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version