టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. డైరెక్టర్, రచయిత అపర్ణ మల్లాది (54) కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె యూఎస్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆపర్ణ మల్లాది ‘ది అను శ్రీ
ఎక్స్పరిమెంట్’ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత తీసిన ‘పోష్ పోరిస్’ అనే వెబ్
సిరీస్ సూపర్ హిట్ సాధించింది.
రెండేళ్ల కిందట ప్రిన్స్, అనీషా, భావన ప్రధాన పాత్రల్లో ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆమె పలు చిత్రాలకు కథలను కూడా అందించారు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కేరాఫ్ ‘కంచరపాలెం’ లాంటి సినిమాలు తెరమీదకు రావడానికి ఆమె కృషి చాలా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ఎంతో మంది నటులకు సినీ అవకాశాలు రావడానికి కూడా ఆమె కారణమయ్యారని తెలుస్తోంది.