తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సంక్షోభం.. కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన కేటీఆర్

-

తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సంక్షోభం నెల‌కొంద‌ని.. ఇది బాధాక‌ర‌మైన ప‌రిస్థితి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాలుగు నెల‌ల్లోనే రైతుల‌కు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన రైతుదీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఎర్ర‌టి ఎండ‌ల్లో కేసీఆర్ రైతుల ద‌గ్గ‌రికి వెళ్లి భ‌రోసా ఇచ్చారు. కేసీఆర్ బాట‌లో బీఆర్ఎస్ శ్రేణులు నేడు దీక్ష‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోయారు. పాలిచ్చే బ‌ర్రెను పంపించి దున్న‌పోతును తెచ్చుకున్నామ‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు. ఎల‌క్ష‌న్ కోడ్ వ‌చ్చింద‌ని సీఎం, మంత్రులు చావుక‌బురు చెబుతున్నారు. పాల‌న త‌న చేతుల్లో లేద‌ని సీఎం రేవంత్ అన‌డం సిగ్గు చేటు. రేవంత్‌కు చిత్త‌శుద్ధి ఉంటే రైతులు ముందుకు రావాలి. పంట‌ల‌కు బోన‌స్ ఇస్తామ‌ని ఈసీకి రేవంత్ లేఖ రాయాలి. మేం కూడా మ‌ద్ద‌తిస్తాం.. మీ తీరుగా ఎక్క‌డా అడ్డుకోం. పంట‌ల‌కు క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్ ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version