తెలంగాణ రైతులకు షాక్.. వారందరికీ రైతుబంధు కట్?

-

తెలంగాణ రైతులకు ఊహించని షాక్ తగిలింది. రైతు భరోసా పథకం అమలు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్… కోతలు విధించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించేందుకు… అనర్హులను ఏరి వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఐటీ చెల్లింపు దారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేసేందుకు… ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోంది.

raithu bandh

బీడు భూములు, రోడ్లు అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ పథకాన్ని వర్తించకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టుగానే సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సర్వే పది రోజుల్లో చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాల్టి నుంచి వ్యవసాయ భూముల సర్వే కూడా ప్రారంభం కాబోతుంది. రైతు భరోసా అమలు కోసం భూ సర్వే చేపట్టనుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్.

అయితే రైతుబంధుకు నిధులు లేకపోవడంతో… ఇలా కోతలు విధించేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు కట్టుకునేందుకు లోన్ అడుగుతే ఐటీ రిటర్న్స్ ఉండాల్సిందేనని బ్యాంకులు చెబుతున్నాయని… మామూలు రైతులు కూడా రిటర్న్స్ కట్టడం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version