అమెరికాలో ఐదుగురిని కాల్చి చంపి.. దుండగుడి ఆత్మహత్య!

-

అమెరికాలోని లాస్ వెగాస్ సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఓ దుండగుడు ఐదుగురిని కాల్చి చంపి, 13 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచిన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. నార్త్ లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎదురుపడటంతో నిందితుడు ఎరిక్ ఆడమ్స్ (57) తనని తాను కాల్చుకున్నట్లు తెలిపారు.

నార్త్ లాస్ వెగాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు మహిళలు చనిపోయినట్లు గుర్తించారు. మరింత లోపలికి వెళ్లగా.. 13 ఏళ్ల బాలిక తీవ్రమైన తుపాకీ గాయాలతో ఉండడం గమనించి ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని మరో అపార్ట్‌మెంట్లో ఇద్దరు మహిళలు, ఓ యువకుడి మృతదేహాలను గుర్తించారు.

దుండగుడి కోసం గాలింపు ముమ్మరం చేసిన అధికారులకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో అతడి గురించి సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకోగా దుండగుడు తుపాకీతో సమీపంలోని ఇంటి పెరట్లోకి పరిగెత్తాడు. లొంగిపోమని చెప్పగా.. దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version