హైదరాబాద్ సమీపంలోనే 200 ఎకరాల్లో AI సిటీ – మంత్రి శ్రీధర్‌ బాబు

-

తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ సమీపంలోనే 200 ఎకరాల్లో AI సిటీ రాబోతుందని ప్రకటించారు మంత్రి శ్రీధర్‌ బాబు. గ్లోబల్ సమ్మిట్ లో AI రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన AI రోడ్ మ్యాప్ లో 25 కార్యక్రమాలను పొందుపరిచారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ…. మానవ జీవన విధానం కొత్త దిశగా మార్చనున్న Ai ఉంటుందని… ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ చాలా వేగం గా ముందుకు వెళుతుందన్నారు.

ఇప్పటికే Ai ప్రభావం ఏంటో మనం అంతా చూస్తున్నామని… తెలంగాణ లో AI రీసెర్చ్ కోసం పెద్ద పెద్ద యూనివర్సిటీలు, విద్య సంస్థల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. డీప్ ఫేక్ లాంటివి AI మాయాజాలం అని…. AI ను ఎథికల్ బెనిఫిట్ కోసం వినియోగించాలని కోరారు. హైదరాబాద్ కి దగ్గర లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మించ బోతున్నం.ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు అని ప్రకటించారు. ట్రిలియన్ డాలర్ ఎకానమీ గా తెలంగాణ పరుగులు పెడుతుందని… AI గ్రోత్ లో ఇది కేవలం ఆరంభం మాత్రమే.AI సిటీ నీ ఫ్యూచర్ లో మరింత గా విస్తరిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version