గుడ్ న్యూస్.. ఆ స్కీము డబ్బులు విడుదల.. ఒక్కొక్కరికీ రూ.లక్షా 30 వేలు..!

-

గుడ్ న్యూస్. ఆ స్కీము డబ్బులు విడుదల చేశారు. దీనితో చాలా మందికి ఊరట లభించబోతోంది. అకౌంట్లోకి డబ్బులు వచ్చి జమ అయ్యాయి. అసలు ఎందుకు ఈ డబ్బులు వచ్చాయి అనేది పూర్తిగా చూసేద్దాం. చేయూత పథకం డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. దీనితో నేతన్నలకు ఊరట లభిస్తుందని చెప్పొచ్చు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలని వారిలో పొదుపు అలవాటు ప్రోత్సహించాలని గత ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. భూదాన్ పోచంపల్లిలో 2015 జూన్ 24న ఈ స్కీముని ప్రారంభించింది. ఈ స్కీము ప్రకారం చూసినట్లయితే కార్మికుడు అతని సహాయకులు ఇద్దరు ప్రతినెలా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.

కార్మికుడు అతని సహాయకులు నెల అంత కష్టపడితే 15000 కూలి వస్తుంది అని నిపుణులు లెక్కపెట్టి చెప్పారు. ఇందులో నుంచి నెలకు 8 శాతం చొప్పున బ్యాంకులో మూడేళ్ల కాలపరిమితిలో ప్రతి నెల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఖాతా ఒకటిలో మొత్తం జమ అవుతూ వస్తుంది. ప్రభుత్వం వీరి కోసం ఖాతా టు తెరుస్తుంది. ఖాతా ఒకటిలో ఎంత మొత్తాన్ని అయితే జమ చేశారో దానికి రెట్టింపు మొత్తాన్ని ప్రభుత్వం ఖాతా టు లో వేస్తుంది. తర్వాత ఈ రెండు ఖాతాల్లో డబ్బులు మూడేళ్ల గడువు తీరిన తర్వాత కార్మికులు విత్ డ్రా చేసుకోవడానికి అవుతుంది. ఇది 2017 లో మొదలైంది. మగ్గం నేసే కార్మికుడు నెలకి 1200 అనుబంధ కార్మికులు ఇద్దరు ఎనిమిది వందలు, 600 చొప్పున ప్రతినెలా బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

ఖాతా టూ లో ప్రభుత్వం డిపాజిట్ చేస్తూ వచ్చింది. దీంతో మూడేళ్ల కాలపరిమితి ఇప్పుడు ముగిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 16799 మంది చేనేత కార్మికులు ఈ స్కీంలో చేరారు అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలామంది చేనేత కార్మికులు ఇందులో చేరారు. మగ్గం కార్మికుడికి ఒకేసారి 1.30 లక్షల వరకు లభించి ఉంటాయి. కార్మికుడు ఒకటికు అయితే 86 వేల వరకు వచ్చాయి. కార్మికుడు 2 కి అయితే 64 వేలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version