ఢిల్లీలో కేసీఆర్ తో ముగిసిన అఖిలేష్ యాదవ్ భేటీ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు వెళ్లారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. నేడు కేసీఆర్ తో సమాజ్వాది పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో శుక్రవారం భేటీ అయ్యారు.

బాబాయ్ శివపాల్ యాదవ్ తో కలిసి అఖిలేష్ ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వీరి ఇరువురి మధ్య సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అఖిలేష్ యాదవ్ తో సమావేశం ముగించుకున్న కేసీఆర్ నేడు సాయంత్రం హైదరాబాదుకు తిరిగి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version