వేములవాడ పట్టణ బంద్ కొనసాగుతోంది. అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు వేములవాడ ప్రజలు. సాయంత్రం వరకు బంద్ ను కొనసాగించాలని వ్యాపారులకు పిలుపు ఇచ్చారు రాజన్న ఆలయ రక్షక కమిటీ సభ్యులు.

ఇది ఇలా ఉండగా… వేములవాడ రాజన్న సన్నిధిలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అక్కడి వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వేములవాడ చుట్టూ రింగ్ రోడ్ లు నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాన్ మార్చింది. దీంతో అక్కడి వ్యాపారస్తులు మళ్లీ తిరగబడుతున్నారు. దీనిపై వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.