హైదరాబాద్ మహానగర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ మరో మూడు గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రి నుంచి వర్షం దంచి కొట్టింది.

జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, మాదాపూర్, సికింద్రాబాద్, సైదాబాద్ అలాగే చంచల్గూడా, బంజర హిల్స్ లాంటి ప్రాంతాలలో.. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఇక ఇవాళ కూడా హైదరాబాద్ మహానగరంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి.
మరో రెండు నుంచి మూడు గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు బయటకు రాకూడదని… పేర్కొంది.