హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌..9000113667 నంబర్‌కు ఫోన్ చేయండి !

-

హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్. హైదరాబాద్‌ మహా నగరంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు… హైదరాబాద్‌ నగరంలో ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేశారు అధికారులు. కాగా, హైదరాబాద్‌ నగరంలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది.

అయితే…నిన్నటి నుంచి హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని HYD-IMD హెచ్చరించింది. దీంతో రంగంలోకి దిగిన GHMC సిబ్బంది ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. అయితే వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర సమస్యలకైన 9000113667 నంబర్ లో సంప్రదించాలని GHMC DRF తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version