తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లు పై చర్చ జరుగుతోంది. చర్చ సందర్భంగా దాదాపు 2 గంటలకు పైగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తరపున కేటీఆర్ మాట్లాడారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ తరుణంలోనే వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబిలీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తది అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించినా. నువ్వు ఎదుగుతావు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు. రా ఈ పార్టీలోకి అని ఆహ్వానించాను. ఈరోజు నన్ను ఎందుకు కక్ష్య తీర్చుకుంటున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఒక ఆడబిడ్డకు బాధ అయితుంటే వినే స్థితిలో లేరా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సబితా ఇంద్రారెడ్డి. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సభ నాయకుడిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు మీరు సబితా ఇంద్రారెడ్డి. 2004లో టీడీపీ నుంచి వస్తే కాంగ్రెస్ లో చేర్చుకున్నాం. ఏ మొహం పెట్టుకొని రేవంత్ రెడ్డిని అంటున్నావంటూ సబితా ఇంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. పార్టీలు మారి పరువు తీసి.. ప్రజాస్వామ్యాన్ని కూల్చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి.