ఏడాది పరిపాలన పై సంతృప్తిగా ఉన్నా : సీఎం రేవంత్ రెడ్డి

-

లక్షలాది మంది రైతులు రైతు పండుగలో పాల్గొన్న రైతులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 02, 2014 తెలంగాన వచ్చింది. అప్పులతో కేసీఆర్ మాకు తెలంగాణను అప్పగించారు. తెలంగాణ రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉంటే.. కేసీఆర్ దానిని పదేళ్లలో 7లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా క్షీణించిందో ప్రజలు గమనించాలన్నారు. ఏడాది పరిపాలన పై సంతృప్తిగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రు నుంచి వైఎస్సార్ వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. 

ఉచిత విద్యుత్, సబ్సీడీలలో ఎరువులు ఇలా చెప్పుకుంటూ వెళ్లితే రైతులు, రైతు కూలీలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప మార్పు అని చెప్పారు. 2023 వర్షాకాలంలో రైతుబంధు ఎగ్గొట్టడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం  7,625 కోట్ల రైతుబంధు మొదటివిడుతగా.. రైతు రుణమాఫీ ని 25 రోజుల్లోనే చేశామని తెలిపారు. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవ్వరూ చెప్పలేదు.. వివరించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version