కేసీఆర్​ పాలనలో భారీ అవినీతి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది: అమిత్ షా

-

కేసీఆర్ హయాంలో తెలంగాణలో భారీ అవినీతి జరిగిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. భూముల వేలంలో రూ.4 వేల కోట్లు అవినీతి జరిగిందని అన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు వేలంలో.. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందని తెలిపారు. హైదరాబాద్​లో మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పగా చెప్పి ఆ మాట మరిచిందని మండిపడ్డారు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్‌ చేసి కుంభకోణానికి పాల్పడ్డారని.. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.

“4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు.. అదీ జరగలేదు. తెలంగాణ విమోచన దినోత్సవం కూడా నిర్వహించటం లేదు. ఎంఐఎంకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు కల్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం. కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. బీజేపీ అధికారంలోకి వరికి క్వింటాల్‌కు రూ.3100 చెల్లిస్తాం. పెట్రోల్‌, డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గిస్తే.. కేసీఆర్‌ తగ్గించలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తాం. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ఆడపిల్లల పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తాం. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, ఎంఐఎం.. మూడు కూడా కుటుంబ పార్టీలే. కాంగ్రెస్‌ వాళ్లను గెలిపిస్తే… వెళ్లి బీఆర్ఎస్లో కలుస్తారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే.. ప్రజల సొమ్ము లూటీ చేస్తారు.” అని అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version