ఖమ్మం పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ హోమ్ మంత్రి తానేటి వనిత ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి షా నేరుగా ఖమ్మం కి బయలుదేరారు. ఖమ్మం బహిరంగ సభతో పాటు బిజెపి నేతలతో భేటీ కానున్నారు అమిత్ షా. మొత్తంగా ఖమ్మంలో రెండు గంటలపాటు అమిత్ షా పర్యటన కొనసాగనుంది.
నేటి ఖమ్మం సభలో అమిత్ షా రైతుల కోసం అనేక హామీలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ బహిరంగ సభకు బిజెపి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసింది. సభ అనంతరం బిజెపి రాష్ట్ర నేతలతో భేటీ కానున్నారు అమిత్ షా. రాష్ట్రంలో బిజెపి చేపట్టబోయే బస్సు యాత్రలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.