కొంగరకలాన్ లో జరిగే బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ నోవాటెల్ హోటల్ లో బీజేపీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి మధ్య ఉన్న వివాదాలు పక్కకు పెట్టి పార్టీ కోసం పని చేయాలని సూచించారు.
అమిత్ షా హైదరాబాద్ కి వస్తున్నాడనే తరుణంలోనే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా మీడియా కి లీకేజ్ లను ఇవ్వకూడదని కాస్త గరమయ్యారు. తెలంగాణలో లోక్ సభ సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమిత్ షా. నాలుగు సిట్టింగ్ ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితి పై ఆరా తీశారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. అమిత్ షా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. భాగ్యలక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు.