ఇవాళ హైదరాబాద్ లో అమిత్ షా పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే హకీంపేట్ నిసా( నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ) కార్యాలయంలో CISF లో రైజింగ్ డే పరేడ్ కార్యక్రమం జరుగనుంది. 53 ఏళ్ల సిఐఎస్ఎఫ్ సేవలను గుర్తించి గౌరవించుకోనుంది ఇండియా. అయితే, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
ఇక అటు 1969 లో మూడు వేల మంది సిబ్బంది తో మొదలైన సిఐఎస్ఎఫ్… కేంద్ర ప్రభుత్వ కార్యాలకయలకు, ఎయిర్పోర్ట్,సీ పోర్ట్ లు, పవర్ ప్లాంట్స్, నేషనల్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కు భద్రత కల్పిస్తోంది. దేశ వ్యాప్తంగా 1 లక్షా 80 వేల మంది సిబ్బందితో పటిష్ట భద్రత సేవలు నిర్వర్తిస్తోంది. హోస్టేజెస్ పరిస్థితి, టెర్రరిస్ట్ అటాక్స్, ఫ్లైట్ హైజాకింగ్స్, బాంబ్ బెదిరింపులు, పేలుడు పదార్థాల గుర్తింపు, వాటి తొలగింపు వాటిల్లో సిఐఎస్ఎఫ్ భద్రత సేవలు అందిస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో.. అమిత్ షా భేటీ అవుతారు.