నీట్ పరీక్ష లీకేజ్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

నీట్ పరీక్ష లీకేజీ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి తో జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేపట్టాలని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల ఇందిరా భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకే సెంటర్ లో ఆరు నుంచి ఏడు మందికి 720కి 720 మార్కులు రావడం పేపర్ లీకేజ్ అయింది అనడానికి బలాన్ని చేకూర్చుతున్నట్లు అభిప్రాయపడ్డారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే దర్యాప్తు సంస్థ అని అలాంటప్పుడు లీకేజీ వ్యవహారంలో కేంద్రం సీబీఐ ఎంక్వైరీ చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు.

వెంటనే జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేపట్టి నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. మరోవైపు ప్రశ్న పత్రాలు అందించడంలో ఆలస్యం చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత వహించకుండా గ్రేస్ మార్కులు కలపడం విడ్డూరంగా ఉందన్నారు ఈ లీకేజీ వ్యవహారంలో లక్షల మంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని పరీక్ష రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు వేసినట్టు గుర్తు చేశారు. గతంలో నిర్వహించిన ఎంసెట్ మాదిరిగానే రాష్ట్రాలకు వైద్య విద్య సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version