రాబోయే ఎన్నికల్లో BRS పార్టీకి శాశ్వతంగా VRS ఇవ్వాలి – వైఎస్ షర్మిల

-

రాబోయే ఎన్నికల్లో BRS పార్టీకి శాశ్వతంగా VRS ఇవ్వాలన్నారు వైఎస్ షర్మిల. కామారెడ్డి రైల్వేస్టేష‌న్ వ‌ద్ద YSR తెలంగాణ పార్టీ బ‌హిరంగ స‌భ‌ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ ష‌ర్మిల మాట్లాడుతూ.. ప్రాణ‌హిత – చేవేళ్ల ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో కామారెడ్డికి కేసీఆర్ తీర‌ని అన్యాయం చేశాడని తెలిపారు. కేసీఆర్ మిష‌న్ భ‌గీర‌థ.. వైఎస్.ఆర్ ఇంటింటి నీళ్ల పథకం కాపీ కొట్టారని.. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే బార్ ఆండ్ రెస్ట్రారెంట్ పార్టీ అని సెటైర్‌ వేశారు.

రాబోయే ఎన్నికల్లో BRS పార్టీకి శాశ్వతంగా వి.ఆర్.ఎస్. ఇవ్వాలి… ఆ పార్టీ నేతలకు రిటైర్ మెంట్ ఇచ్చి కేసీఆర్ ను ఫామ్ హౌజ్ లో కూర్చోబెట్టాలని కోరారు. కామారెడ్డి ఎం.ఎల్.ఏ. గంప గోవర్ధన్ భూకబ్జాలు చేస్తున్నాడని.. ప్ర‌భుత్వ భూమిలో మూడంతస్తుల మేడ కట్టాడని నిప్పులు చెరిగారు. గంప గుత్త‌గా అన్నింటిలో ఆయ‌న‌కే క‌మీష‌న్లు అని.. అబ్దుల్లాపూర్ లో 100 ఎక‌రాలు ప్ర‌భుత్వ భూములు క‌బ్జా చేసి వేల‌కోట్లు సంపాధన పై సమాధానం చెప్పాలని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version