మహిళ ఎస్ఐ ని జుట్టుపట్టి పక్కకు ఈడ్చినా అంగన్వాడీలు..!

-

అంగన్ వాడీ టీచర్లు, వర్కర్లు ఆంధోళన చేపడుతున్న విషయం తెలిసిందే. తమను పర్మినెంట్ చేయాలని.. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు అంగన్ వాడీలు. రోజు రోజుకు అంగన్ వాడీ అస్వస్థతకు గురవ్వడం స్పృహ తప్పి పడిపోవడం వంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇవాళ తాజాగా ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.


రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో భాగంగా అంగన్ వాడీలు ఆదిలాబాద్ కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు గేట్లు మూసివేశారు. ఓ అంగన్ వాడీ గేట్ వద్దకు చొచ్చుకొని పోవడంతో.. పోలీసులు వెనుకవైపు నుంచి ఆపేందుకు ప్రయత్నించారు. గేట్ లోపలికి వెళ్తున్న అంగన్ వాడీలను అడ్డుకుంటున్న క్రమంలో ఓ మహిళా ఎస్ఐని అంగన్ వాడీలు జుట్టు పట్టి వెనక్కి లాక్కెల్లారు. ఈఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతరం పలువురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడం విశేషం.

https://x.com/TeluguScribe/status/1704408277675921700?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version