రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును సజ్జలు కరిగించేస్తాయి.. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిందే

-

ఇప్పుడిప్పుడే జనాల్లో..చిరుధాన్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. మొన్నటివరకూ కేవలం మినపప్పును మాత్రమే టిఫెన్స్‌కు వాడేవాళ్లు.. ఇప్పుడు రాగులు, సజ్జలు, జొన్నలను కూడా చేర్చుకుంటున్నారు. చిరుధాన్యాల వాడకం తగ్గడం, బియ్యం వాడకం పెరగడం వల్ల రోగాల సంఖ్య ఎక్కువైంది.. మన పూర్వీకులు ఉన్నంత బలంగా మనం లేవు.. మనం ఉన్నంత బలంగా మన పిల్లలు అసలు లేరు. కారణం వైట్‌ పాయిజన్.. గుండె సమస్యలు ఎక్కువైపోయాయి. గుండెకు ఆక్సిజన్ అందక కార్డియాక్ అరెస్టులు, గుండెపోటుతో మరణించే వారి శాతం ఘోరంగా పెరిగింది. గుండె సమస్యలకు ప్రధాన కారణం. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం.. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే, సజ్జలతో వండిన ఆహారాలు తినడం ముఖ్యం అంటున్నారు వైద్యులు..

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్లే ఎక్కువగా గుండె వైఫల్యం చెందుతున్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. సజ్జలతో చేసిన అన్నం, రొట్టెలు, అల్పాహారాలు తినడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు బయటికి పోతుంది. సజ్జల్లో ఉండే ఫైటో కెమికల్ రక్తనాళాల్లో కొవ్వును పేరుకుపోనివ్వదు. ఒకవేళ పేరుకుపోయినా కూడా దానిని బయటికి పంపించేందుకు సహకరిస్తుందట. చాలా మంచి విషయం కదా…కొవ్వు పేరుకుపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు.

ఈ సజ్జల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణం ఉంది. అలాగే సజ్జల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. శరీరంలో ఎక్కడా కొవ్వు చేరకుండా కాపాడే గుణం సజ్జలకు ఉంది. కాబట్టి అధిక బరువు బారిన పడే అవకాశం ఉండదు.. అధిక బరువు వల్ల వచ్చే సమస్యలు.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం, ఊబకాయం వంటివన్నీ కూడా దూరంగా ఉంటాయి.

సజ్జలను రవ్వగా చేసి ఇంట్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడల్లా వాటితో సంగటి, అన్నం చేసుకొని తినవచ్చు. అలాగే పిల్లలకు అల్పాహారాలు, చిరుతిళ్లు కూడా చేసుకోవచ్చు. సజ్జలతో చేసిన రొట్టెలు టేస్టీగా ఉంటాయి. వీటిని నాన్ వెజ్ కర్రీలతో తింటే వదలకుండా లాగించేస్తారు. ఒక నెలపాటు సజ్జలతో అన్నం వండుకుని తిని చూడండి. ఆరోగ్యంలో మార్పు మీరే స్పష్టంగా చూస్తారు. చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. మధుమేహం బారిన పడిన వాళ్ళు ఆ వ్యాధి లక్షణాలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version