హైదరాబాద్ కి మరో డిజి టెక్ డెవలప్మెంట్ సెంటర్ రానుంది. మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో తన డి జిటేక్ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది క్యాలవే (Callaway) గోల్ఫ్ కంపెనీ. గోల్ఫ్ క్రీడకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ క్యాలవే (Callaway) హైదరాబాద్ లో తన డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ బ్రాండ్స్ ఒడిసి, ట్రవిస్ మాథ్యూ, ఓజియో, జాక్ వోల్ఫ్ స్కిన్ లను కలిగి ఉన్న క్వాలవే వార్షికాదాయం 3.2 బిలియన్ డాలర్లు. ఈ డిజిటెక్ సెంటర్ తో గోల్ఫ్ క్రీడకు సంబందించిన డేటా అనలిటిక్స్ తో పాటు తన గ్లోబల్ కార్యకలాపాలకు సపోర్టు ను, టెక్ సొల్యూషన్స్ ను అందించేందుకు ఈ డిజిటెక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ డిజిటెక్ సెంటర్ తో గోల్ఫ్ ఆటగాళ్ల ఆటతీరుతో సహా వారి క్రీడా నైపుణ్యం, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయానికి సంబంధించి ఎదురయ్యే అనేక సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను తమ కంపెనీ సూచిస్తుందని తెలిపింది.
లాస్ ఏంజలెస్ కి దగ్గరలో వున్న కాల్స్ బాద్ నగరంలో మంత్రి కే తారకరామారావు, కాల్ వే కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, సి ఎఫ్ వో బ్రయన్ లించ్, సి ఐ వో సాయి కూరపాటి లతో సమావేశం అయ్యారు. అమెరికా తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే సెంటరే అతిపెద్దదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. డిజిటెక్ సెంటర్ ఏర్పాటుతో తొలి దశలో అత్యంత నైపుణ్యం కలిగిన 300 మంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు ఉపాధి దొరుకుతుందన్నారు. పెట్టుబడికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తామన్నారు క్వాలవే ప్రతినిధులు.