హైదరాబాదులో డ్రగ్స్ విక్రయిస్తూ మరో నైజీరియన్ పట్టుబడ్డాడు. బిజినెస్ వీసాపై ఇండియాకి వచ్చిన నైజీరియా కు చెందిన ఒకారో కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి 2014లో న్యూఢిల్లీకి వచ్చిన ఒకారో అక్కడి నుండి హైదరాబాద్ కు వచ్చారు. బట్టల ఎగుమతి పేరుతో దేశంలో పలు ప్రాంతాలలో తిరిగాడు.2016లో గోల్కొండ పోలీసులు ఇతనితో పాటు మరో నైజీరియన్ ను డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. బెయిల్ పై విడుదలైన తర్వాత బెంగళూరుకు చెందిన ఒబాసి అనే నైజీరియన్ నుండి కొకైన్ డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ లో పెడ్లర్ గా మారాడు.
2018లో గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు కోకైన్ సరఫరా చేస్తుండగా అరెస్టు చేశారు.కస్టమర్లకు టెలిగ్రామ్ ద్వారా డ్రస్సులు సరఫరా చేస్తున్నాడు. ఒకారో కాస్మోస్ రాంసీ నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపతి అనే మరో డ్రగ్ పెడ్లర్ అరెస్టు అయ్యాడు. ఇతని దగ్గరి నుండి 43 ఎల్ఎస్‌డి బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.