ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. 40 మంది మహిళలపై లైంగిక వేధింపులు..!

-

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ మారింది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్లోని ఓ హౌజ్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనేక అంశాలు చర్చకు వచ్చాయని తేలడం పోలీసులు ఆ గెస్ట్ హౌజ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేసులో కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు ట్యాపింగ్ను అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.. కేసులో పోలీసులు నలుగురు కానిస్టేబుల్స్ను అదుపులోకి తీసుకున్నారట. అలాగే పలువురు నేతలకు, నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరూ కానిస్టేబుల్స్ ఫోన్ ట్యాపింగ్ తో ఒక్కరూ కాదు.. ఇద్దరూ కాదు ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగా వేధించారట. విచారణతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొందరి డేటా సేకరించి వ్యక్తిగత జీవితాలను కూడా కానిస్టేబుళ్లు టార్గెట్ చేశారట. నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో వారు రూమ్ లు ఏర్పాటు చేశారట. మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వహకుల నుంచి  కానిస్టేబుల్స్ భారీ వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version