తెలంగాణ రైతులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇకపై పంటలు వేశాకే…రైతు బంధు ఇవ్వనున్నారట. 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివరలో పంట సాయం అందించే ఆలోచన ఉందట.
గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు వేయనున్నట్లు తెలిపారు. 5 ఎకరాల వరకే రైతు బంధు అనడంతో.. కొంత మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు ఇప్పటి వరకు తీసుకున్న లోన్లు కట్టాలని రైతులకు లీగల్ నోటీసులు పంపుతున్నాయి బ్యాంకులు. దీంతో గందరగోళానికి లోనవుతున్నారు రైతులు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 2 లక్షల రుణ మాఫీ ఉత్త మాటేనా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.