కంపెనీలోకి ప్రవేశించి ఎలుగుబంటి హల్ చల్.. వ్యక్తిపై దాడి..!

-

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామంలోని జేపీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిపై శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎలుగుబంటి దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించి దోమలపెంట అటవీ క్షేత్ర అధికారి గురు ప్రసాద్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో ఒక ఎలుగుబంటి దోమల పెంట గ్రామంలో గల జెపి కంపెనీలో ఎలక్ట్రికల్ వైన్డర్గా పనిచేస్తున్న శత్రుజ్ఞ లాల్ అనే వ్యక్తిని ఎలుగుబంటి గాయపరిచిందన్నారు.

గాయపడిన వ్యక్తిని జేపీ కంపెనీలో గల డిస్పెన్సరీ హాస్పిటల్లో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఏపీలోని సున్నిపెంట వైద్య కేంద్రానికి పంపించామన్నారు. డాక్టర్ సలహా మేరకు సదరు గాయపడిన వ్యక్తికి చికిత్స పొందుతున్నారు. శనివారం మరో సారి స్కానింగ్ చేసి ఇంకా ఏమైనా అదనపు చికిత్స అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటారని వివరిస్తూ.. ప్రస్తుతం అతను ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కంపెనీలో మిగతా వారు ఆ ఎలుగుబంటిని అడవిలోకి తరిమారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version