ఏపీ గ్రూప్-1 నోటిఫికేష‌న్ విడుదల..ఎన్ని పోస్టులున్నాయంటే..?

-

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల జాత‌ర కొన‌సాగుతుంది. కొంత‌కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ – 1,గ్రూప్ – 2 ఉద్యోగాల భ‌ర్తీకి ఒక్క రోజు గ్యాప్ తో నోటిఫికేష‌న్ లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిన్న గ్రూప్ -2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా.. ఇవాళ గ్రూప్ – 1 నోటిఫికేష‌న్ జారీ చేసింది. వివిధ శాఖ‌ల్లో మొత్తం 81 ఉద్యోగాల‌ను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఉద్యోగాల‌కు భ‌ర్తీకి సంబంధించి ఆగ‌స్ట్ 28 వ తేదీనే ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే సాంకేతిక కార‌ణాల‌తో నోటిఫికేష‌న్ జారీ కాస్త ఆల‌స్యమ‌యింది. గ్రూప్ -1 ఉద్యోగాల‌కు జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి 21వ తేదీ వ‌ర‌కూ ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. మార్చి 17వ తేదీన గ్రూప్ – 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.సిల‌బ‌స్ తో పాటు ఇత‌ర వివ‌రాల‌ను ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో పొందుప‌రిచారు అధికారులు.

ఏపీపీఎస్సీ గ్రూప్ – 1లో భ‌ర్తీ చేసే ఉద్యోగాలివే :

డిప్యూటీ క‌లెక్టర్ పోస్టులు: 9
స్టేట్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పోస్టులు: 18
డీఎస్పీ పోస్టులు: 26
జైళ్ల శాఖ‌లో డిప్యూటీ సూప‌రింటెండెంట్ పోస్టులు: 1
డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస‌ర్ పోస్టులు:1
ప్రాంతీయ ర‌వాణా ఆఫీసర్ పోస్టులు: 6
జిల్లా బీసీ వెల్పేర్ ఆఫీస‌ర్ పోస్టులు:1
జిల్లా సోష‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పోస్టులు: 3
ఏపీ కోఆప‌రేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 10
గ్రేడ్-2 మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పోస్టులు: 11
అసిస్టెంట్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ పోస్టులు: 1
అసిస్టెంట్ ట్రెజ‌రీ ఆఫీస‌ర్ పోస్టులు: 3
జిల్లా ఉపాధి క‌ల్ప‌నా అధికారుల పోస్టులు: 4
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్ పోస్టులు: 2

Read more RELATED
Recommended to you

Exit mobile version