తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములు అమ్ములకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర బార్డర్ల వరకు మహిళలు బాలికలకు ట్రాన్స్ జెండర్ లకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది.
రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ స్కీము ప్రారంభం కాబోతుందని ప్రభుత్వం ప్రకటించింది. సిటీలలో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లో ఈ అవకాశాలు ఉంటాయి. కేవలం తెలంగాణకు చెందిన మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్రీ జర్నీ ఖర్చులను ఆర్టీసీకి ప్రభుత్వము రియంబర్స్ చేస్తుంది. భవిష్యత్తులో ఫ్రీ జర్నీ కోసం సాఫ్ట్వేర్ ఆధారిత మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందజేస్తారు. ఆర్టీసీ అధికారులు ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటారు.