టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దద్దమ్మలా ?- ఎంపీ లక్ష్మణ్

-

కెసిఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందా.. అంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా దద్దమ్మలా? అని ప్రశ్నించారు బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్. మునుగోడు ఉప ఎన్నికతో టిఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కుంగిపోతున్నాయన్నారు. ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిందని.. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎందుకు దడుచుకుంటుందని ప్రశ్నించారు.

దుబ్బాక, హుజురాబాద్ లో ప్రజా తీర్పుతో టిఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. ఉద్యమానికి ఊపిరి పోసిన ఉప ఎన్నికలు.. ఇప్పుడు అవే ఎన్నికలు అంటే టిఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. మునుగోడులో మంత్రులు, 86మంది ఎమ్మెల్యేలు మకాం వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టిఆర్ఎస్ కుల, గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతూ ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరు అన్నారు.

మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, పార్టీలు ప్రశ్నిస్తే కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించారని.. మునుగోడులో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ అసహనంతో మునుగోడులో లబ్ది పొందేందుకు కొత్త మండలంతో పాటు గిరిజన బంధు ప్రకటించారని అన్నారు. కుల వృత్తులపైన ఆధారపడిన బీసీల ఫెడరేషన్, కార్పొరేషన్లకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతో తోక పార్టీలని విమర్శించిన కేసీఆర్ కమ్యూనిస్టులతో జత కట్టారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version