సీతారాముల కళ్యాణం మిస్సవుతున్నారా? మీ ఇంటికే తలంబ్రాలు రావాలంటే ఇలా చేయండి

-

సీతారాముల కళ్యాణం ఈనెల 6వ తేదీన భద్రాచలంలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, రాములోరి కల్యాణం చూడలేకపోతున్నాం అని బాధపడేవారికి పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. స్వామివారి అర్చన తలంబ్రాలు, అక్షింతలను అర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది తెలంగాణ పోస్టల్ సర్కిల్.

అందుకు దేవాదాయ శాఖ సహకారం కూడా తీసుకుంది. అక్షింతలు, తలంబ్రాలు మాత్రమే కాదు ప్రసాదం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వివరాలకు దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదిస్తే వారే వివరాలు చెబుతారు.భక్తుల చిరునామాకు స్పీడ్ పోస్టు ద్వారా మీ ఇంటికే రాములవారి తలంబ్రాలు, అక్షింతలు పంపిస్తతారు. అందుకు భక్తులు ముత్యాల తలంబ్రాల కోసం రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news