లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు ఆర్నవ్ మృతి చెందాడు. నిలోఫర్ లో చికిత్స పొందుతున్న బాలుడు ఆర్నవ్ కాసేపటి క్రితమే మృతి చెందాడు. నిన్న లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవడంతో కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు ప్రకటించారు నిలోఫర్ వైద్యులు. వెంటిలేటర్ పై నిన్నటినుంచి కృత్రిమ శ్వాస ను అందించారు వైద్యులు.

దాదాపుగా రెండున్నర గంటల పాటు.. లిఫ్ట్ లో సగం బాడీ ఇరుక్కు పోవడంతో బ్రెయిన్ కి, హార్ట్ కి ఆక్సిజన్ అందలేదు. దీంతో బ్రెయిన్ కి పిట్స్ ఎటాక్ అయ్యింది.. కొద్దిసేపటి క్రితం బాలుడు మృతి చెందాడు. దీంతో… విషాద ఛాయలు అలుముకున్నాయి.