శ్రీ శైలం ఎడమ కాలువ గట్టు కెనాల్ టెన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలని..పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందో తేల్చాలని కవిత ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పై కప్పు కూలిన ఘటనలో కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమన్నారు. కేసీఆర్ హయాంలో 10 కి.మీ. మేర టన్నెల్ తవ్వారని..ఏనాడూ ఇటువంటి ప్రమాదం జరగలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని..అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యులని? కవిత అడిగారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్ తవ్వాల్సి ఉందని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.