తెలంగాణ ఎన్నికలపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. శాస్త్రిపురంలో నా ఓటు హక్కు వినియోగించుకున్నానని తెలిపారు ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారు అన్నది వారి ఇష్టం అన్నారు. 100 శాతం పోలింగ్ లో ఓటర్లు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోండని.. ఓటు వేయడం ద్వారా నాయకులపై బాధ్యత మరింత పెరుగుతుందని వివరించారు ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయండని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల పోలింగ్ లో యువత పాల్గొనాలి… కనీసం ఓ అరగంట సమయం వెచ్చించి ఓటు హక్కును వినియోగించుకోండని స్పష్టం చేశారు ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.