Ashada Masotsavam 2024: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు

-

Ashada Masotsavam 2024: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే అ భక్తుల సారే సమర్పణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవస్థానం. నేటి నుండి 16వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై మొదటిసారి వారాహి నవరాత్రులు జరుగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో రామారావు మాట్లాడుతూ… వచ్చే నెల 6 నుంచి నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రి పై ఆషాఢ‌ మాస సారె మహోత్సవం ఉంటుందన్నారు.

Ashada Masotsavam on Indrakiladri from today

భక్తులు అమ్మవారి కి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే నెల 19 తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఈ ఉత్సవాలు జులై 6 నుంచీ 15వరకు జరుగుతాయని చెప్పారు. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతామని… 14న తెలంగాణా మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు.

ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది… మద్యాహ్నం మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారన్నారు. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామని… 11:45 నుంచీ 12:15 వరకూ మహా నివేదన ఉంటుందని తెలిపారు.
11:30 నుంచీ 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు… సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version