బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి : ఎంపీ మల్లు రవి

-

బీఆర్ఎస్ పై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని పథకం ప్రకారం.. బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కొడంగల్ లో భూ సేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెల్లారు. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారని పేర్కొన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలున్నాయి. ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతున్నారని మల్లు రవి మండిపడ్డారు.

ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చూపించాలనే డ్రామాలో భాగంగానే కొడంగల్ ఘటన చేసారు. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కు నిమిష నిమిషానికి ఫోన్లు చేసి.. మందు సేవించి కలెక్టర్ పై దాడి చేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై జరిగిన దాడి కాదు.. ప్రజా స్వామ్య పాలన పై జరిగిన దాడి అన్నారు. కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడూ హింస మార్గంలో పోరాటం చేయలేదు. అహింస మార్గంలోనే తాము కేసీఆర్ పై పోరాడామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version