విజయనగరం లోకల్ బాడీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. టిడిపి వ్యూహమా..?

-

ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.. దీంతో అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేశారు.. నవంబర్ 11 తో నామినేషన్ల స్వీకరణ ఘట్టం కూడా ముగిసింది..కూటమి తరపున ఎవ్వరూ పోటీ చేయకపోవడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఇదే సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ప్రస్తుత ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు..

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా.. తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం రాజకీయ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి ఇందుకూరి సుధారాణి నామినేషన్ వెనుక కూటమి వ్యూహం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.. కూటమి తరపున గట్టి పోటీ లేకపోతే వైసిపి అభ్యర్థిగా ఉన్న అప్పలనాయుడు సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.. అయితే చివరి రోజు ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఈ ఎమ్మెల్సీ స్థానం ఉన్నది.. స్థానిక ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుకు మధ్య అంతర్గత విభేదాలు ఎక్కువ అవటం, రఘురాజు సతీమణి సుధారాణి తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.. ఈ క్రమంలో అనర్హత వేటు పడింది.. అయితే రఘురాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. అనర్హత వేటును కొట్టేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఆ ఆర్డర్ కాపీ ఎలక్షన్ కమిషన్కు చేరకపోవడంతో.. ఎన్నికల సంఘం.. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది..

రఘురాజు సతీమణి సుధారాణి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోంది.. అయితే సుధారాణి నామినేషన్ దాఖలు చేయడం వెనుక టిడిపి అధిష్టానం ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో బలంగా వినిపిస్తోంది.. టిడిపికి బలం లేకపోవడంతో.. సుధారాణిని బరిలోకి దింపి తెరవెనుక మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందనే చర్చ నడుస్తోంది.. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది.. ఓట్ల పరంగా సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో.. కచ్చితంగా గెలిచి తీరుతాం అనే భావనలో వైసిపి నేతలు ఉన్నారు.. మొత్తంగా ఈ ఎన్నికలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో కాక రేపుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version